పంజా సినిమా మీద పవర్ స్టార్ ఫ్యాన్స్ కి బోల్డన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కొత్త లుక్, కొత్త గెటప్.. తోడుగా నవనవలాడుతున్న ఇద్దరు ముద్దుగుమ్మలు, స్టైలిష్ టేకింగ్ కి మారుపేరైన విష్ణువర్ధన్. అన్నిటికి మించి డబ్బింగ్ పాటలతో అదరగొట్టేస్తున్న యువన్ శంకర్ రాజా మరోసారి టాలీవుడ్ లో సత్తా చాటుకునేందుకు వచ్చాడు. పవన్ ఫస్ట్ లుక్ చూసినోళ్లు సీరియస్ సినిమా ఏమో అని భయపడ్డారు కానీ ట్రయిలర్ చూశాక ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉందని ఊరట చెందారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవన్ కి ఉన్నంత లాయల్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోకి లేదనే మాట వాస్తవం. ఓపెనింగ్స్ వరకు ఢోకా ఉండదు కానీ ఆ తర్వాత సినిమాని నిలబెట్టడంలోనే స్టార్ పవరేంటో తెలిసేది. అసలే వరస ఫ్లాపులతో స్లో అయిన కళ్యాణ్ బాబు బాక్సాఫీస్ కి తన పంజా దెబ్బ చూపిస్తాడో లేదో మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది.
Tuesday, 29 November 2011
Monday, 28 November 2011
Crazy Kolaveri
ఏ ముహూర్తాన ధనుష్ కొలవేరి పాట రాశాడో కానీ అది పుట్టించిన వేడి అంతా ఇంతా కాదు.. ఇంగ్లిష్ పాటకి కొంచెం తమిళ యాస తగిలించి పాడిన ఆ పాట ఫీవర్ కొలిచేందుకు థర్మామీటర్లు దొరకడం లేదు. టివి, రేడియో, కంప్యూటర్.. అదీ ఇదీ అని లేదు.. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఆ పాటే.. అర్థమైనా కాకపోయినా పర్లేదు.. కొలవేరి పాట వినాల్సిందే.. పాడాల్సిందే. లేకపోతే ఏదో వింత గ్రహం నుంచి వచ్చినట్టు చూస్తున్నారు.. ఇప్పటి దాకా రజనీకాంత్ సినిమా అంటే కళ్లు మూసుకుని టికెట్ కొనేస్తున్న అభిమానులు, ఈ కొలవేరి పాటతో రజనీ అల్లుడు ధనుష్ ని కొలిచే దైవంగా మార్చేస్తారేమో.. ఇప్పటికే యూట్యూబ్ లో 11 మిలియన్లకు పైగా హిట్స్ వచ్చాయంటే ఈ కొలవేడిని కొలిచేదెలా??అందుకు తగ్గట్టుగానే ఈ పాటకి పేరడీలు, మార్పింగ్ లు రోజుకోటి వచ్చి పడుతున్నాయి. ఇక మన తమిళ తంబీలు వాళ్ల ఓవర్ యాక్షన్ చూపెట్టేందుకు ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ ఒబామా ఈ పాట చూసి థ్రిల్లవుతున్నట్టు ఓ క్లిప్ కూడా వదిలారు..
Labels:
3,
Aishwarya,
Anirudh,
Dhanush,
Kolaveri,
Rajnikanth,
Shruthi Hassan
Subscribe to:
Posts (Atom)