Powered By Blogger

Thursday, 1 December 2011

ఇమేజ్ న్యూస్ ఛానెల్ వచ్చేస్తోంది...

ఇప్పటికే కెమెరా స్టాండ్లు పట్టే ప్రెస్ మీటింగ్ హాల్ వెతుక్కోడానికి ప్రెస్ మీట్ పెట్టేవాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే రిపోర్టర్లు కెమేరా మెన్స్, ప్రింట్ కెమెరా మెన్లు, ప్రింట్ జర్నలిస్టులతో కిటకిట లాడిపోతుంది. ఏదైనా ధర్నాజరిగినా.. మీటింగ్ జరిగినా.. జస్ట్ మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ స్టాఫ్ తోనే సక్సెస్ అవుతుందనే సెటైర్లు కూడా ఈ మద్య పేలాయి. ఇప్పటికే ఉన్న న్యూస్ చాలదన్నట్టు... మరో మూడు చానళ్లు క్యూ కట్టిన విషయం తెలిసిందే.. వి6, టీఎన్‌ఎన్, తులసీ సీడ్స్ వారి చానల్ తో బాటు.. కొత్తగా ఇమేజ్ బ్రాడ్ కాస్టింగ్ రంగంలోకి దిగింది.. ఇప్పటికే ఆ సంస్థ జోరుగా రిక్రూట్‌చేసుకుంటోంది. ఇప్పటి వరకు వైద్యవ్యాపారంలో ఉన్న ఆ సంస్థ వార్తా వ్యాపారంలోకి దిగడంతో.. జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకునే వాళ్లకు.. ఇప్పటికే ఎంచుకొని రకరకాల అనుభవాలతో, అనుభూతులతో అవస్థలు పడే వాళ్లకు మరో మంచి అవకాశం వచ్చినట్టే. ఇమేజ్ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ... అన్ని విభాగాల్లో రిక్రూట్ చేసుకుంటోంది.. ఆశావహులు అప్లై చేసుకోవచ్చు.....

No comments:

Post a Comment