Powered By Blogger

Monday, 28 November 2011

Crazy Kolaveri

ఏ ముహూర్తాన ధనుష్ కొలవేరి పాట రాశాడో కానీ అది పుట్టించిన వేడి అంతా ఇంతా కాదు.. ఇంగ్లిష్ పాటకి కొంచెం తమిళ యాస తగిలించి పాడిన ఆ పాట ఫీవర్ కొలిచేందుకు థర్మామీటర్లు దొరకడం లేదు. టివి, రేడియో, కంప్యూటర్.. అదీ ఇదీ అని లేదు.. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఆ పాటే.. అర్థమైనా కాకపోయినా పర్లేదు.. కొలవేరి పాట వినాల్సిందే.. పాడాల్సిందే. లేకపోతే ఏదో వింత గ్రహం నుంచి వచ్చినట్టు చూస్తున్నారు.. ఇప్పటి దాకా రజనీకాంత్ సినిమా అంటే కళ్లు మూసుకుని టికెట్ కొనేస్తున్న అభిమానులు, ఈ కొలవేరి పాటతో రజనీ అల్లుడు ధనుష్ ని కొలిచే దైవంగా మార్చేస్తారేమో.. ఇప్పటికే యూట్యూబ్ లో 11 మిలియన్లకు పైగా హిట్స్ వచ్చాయంటే ఈ కొలవేడిని కొలిచేదెలా??అందుకు తగ్గట్టుగానే ఈ పాటకి పేరడీలు, మార్పింగ్ లు రోజుకోటి వచ్చి పడుతున్నాయి. ఇక మన తమిళ తంబీలు వాళ్ల ఓవర్ యాక్షన్ చూపెట్టేందుకు ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ ఒబామా ఈ పాట చూసి థ్రిల్లవుతున్నట్టు ఓ క్లిప్ కూడా వదిలారు..

No comments:

Post a Comment