పంజా సినిమా మీద పవర్ స్టార్ ఫ్యాన్స్ కి బోల్డన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కొత్త లుక్, కొత్త గెటప్.. తోడుగా నవనవలాడుతున్న ఇద్దరు ముద్దుగుమ్మలు, స్టైలిష్ టేకింగ్ కి మారుపేరైన విష్ణువర్ధన్. అన్నిటికి మించి డబ్బింగ్ పాటలతో అదరగొట్టేస్తున్న యువన్ శంకర్ రాజా మరోసారి టాలీవుడ్ లో సత్తా చాటుకునేందుకు వచ్చాడు. పవన్ ఫస్ట్ లుక్ చూసినోళ్లు సీరియస్ సినిమా ఏమో అని భయపడ్డారు కానీ ట్రయిలర్ చూశాక ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉందని ఊరట చెందారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవన్ కి ఉన్నంత లాయల్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోకి లేదనే మాట వాస్తవం. ఓపెనింగ్స్ వరకు ఢోకా ఉండదు కానీ ఆ తర్వాత సినిమాని నిలబెట్టడంలోనే స్టార్ పవరేంటో తెలిసేది. అసలే వరస ఫ్లాపులతో స్లో అయిన కళ్యాణ్ బాబు బాక్సాఫీస్ కి తన పంజా దెబ్బ చూపిస్తాడో లేదో మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది.
No comments:
Post a Comment