ఈ మధ్య ప్రతి సినిమాకి పంచ్ డైలాగులు ప్రాణంగా ఉంటున్నాయి. కొంత మంది ఫ్యాన్స్ వాళ్ల క్రియేటివిటీ మేరకు కొన్ని సొంత డైలాగ్స్ రాసి సోషల్ నెట్ వర్క్స్ లో పోస్ట్ చేస్తున్నారు. పంజా ట్రైలర్ లో వదిలిన ఓ పంచ్ డైలాగ్ బాగా పేలింది. దాన్ని బేస్ చేసుకుని రాశారో.. నిజంగానే ఆ డైలాగులు సినిమాలో ఉన్నాయో తెలీదు కానీ పంజా డైలాగులంటూ కొన్ని సంభాషణలు తెగ సర్కులేట్ అవుతున్నాయి. ఇవి నిజంగా సినిమాలో ఉన్నాయా.. ఉంటే సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేందుకు ప్రొడ్యూసర్లే వీటిని లీక్ చేసి జనంలోకి వదిలారా.. లేక ఎవరైనా అభిమానుల ఊహాశక్తికి నిదర్శనమా అనేవి వదిలేస్తే.. ఈ డైలాగులు విన్నవాళ్లు ఓ సారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గొంతులో వీటిని ఊహించేసుకుని తెగ మురిసిపోతున్నారు.
No comments:
Post a Comment