Powered By Blogger

Thursday, 8 December 2011

రాష్ట్రాల ఏర్పాటుపై కేంద్రం కొత్త మెలిక

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చినట్లుగానే కనబడుతుంది.కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జితేందర్ సింగ్ పార్లమెంటుకు ఇచ్చిన సమాధానం చూస్తే తెలంగాణ ఇప్పట్లో సాధ్యం కాదని చెప్పినట్లు అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు ఏకాభిప్రాయ సాధన ద్వారానే కొత్త రాష్ట్రాలు అన్న కేంద్రం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి మాతృ రాష్ట్రంలో ఏకాభిప్రాయ సాధన తర్వాతే కొత్త రాష్ట్రం ఏర్పాటు సాధ్యమని తేల్చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కొంతకాలం క్రితం చేసిన ప్రకటనను కూడా పరిగణనలోకి తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగానే ఈ సమాధానం చెప్పించినట్లు కనిపిస్తుంది.కొత్త రాష్ట్రాల ఏర్పాటు పర్యవసనాలు చాలా ఉంటాయని కూడా వ్యాఖ్యానించడం గమనించదగిన అంశంగా ఉంటుంది. మాతృ రాష్ట్రం అంటే ఇప్పుడు మన రాష్ట్రాన్ని తీసుకుంటే ఆంధ్ర, రాయలసీమలు కలిపి ఆంధ్ర రాష్ట్రంగా ఉంటే హైదరాబాద్ లోని తెలంగాణ ప్రాంతం వచ్చి ఆంధ్రలో విలీనం అయింది. ఆ మేరకు ఇరు రాష్ట్రాల శాసనసభలో అప్పట్లో తీర్మానం చేశాయి.కనుక ఆంధ్ర, రాయలసీమ ప్రజలు లేదా ప్రతినిధులు ఒప్పుకుంటేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమని చెప్పకనే చెప్పినట్లయింది.

No comments:

Post a Comment