అవిశ్వాసాన్ని బలపరిచి జగన్ పక్షాన నిలిచిన అధికార పక్ష సభ్యులపై వేటు వేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. 'తీర్మానానికి సానుకూలంగా స్పందిస్తే కఠినంగా వ్యవహరిస్తాం' అని సీఎం కిరణ్ ముందుగానే ప్రకటించారు. తోక జాడిస్తే కత్తిరిస్తామంటూ మంత్రుల వద్ద జరిగిన సమావేశంలోనూ వ్యాఖ్యానించారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను సోమవారం మధ్యాహ్నమే కలసి డివిజన్ కావాలని టీడీపీ సభ్యులు లిఖితపూర్వకంగా కోరారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ కూడా స్వాగతించింది. విప్‌ను ధిక్కరించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ పీఆర్పీ మంగళవారం ఉదయం శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. మొత్తానికి ప్రసుత్తం ఖాళీగా ఉన్న 7 స్థానాలతో పాటు జగన్‌వర్గానికి చెందిన 17 మందిపై వేటు పడితే... 24 శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇక సోమారపు సత్యనారాయణ పూతలపట్టు రవిలపై కూడా వేటు పడితే.. ఈ సంఖ్య 26కు పెరుగుతుంది. కాగా .. అవిశ్వాస తీర్మానానికి సానుకూలంగా స్పందించిన తెలుగుదేశం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై ఎలాంటి చర్యలు ఉండవు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాసానికి తీర్మానం ఇచ్చినందున ఆయనపై చర్యలు ఉండవు. మొత్తానికి మరో ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు .. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరిగితే.. ఎవరి బలం ఏమిటో ప్రజాక్షేత్రంలోనే తేలిపోనున్నది. జగన్ వర్గం ఇదే: వైఎస్ విజయ (వైఎస్ఆర్ కాంగ్రెస్) బాలరాజు కొండా సురేఖ పిల్లి సుభాష్ చంద్రబోస్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చెన్న కేశవ రెడ్డి అమర్నాథ రెడ్డి బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రసాద రాజు సుచరిత గురునాథ రెడ్డి కాపు రామచంద్రా రెడ్డి ధర్మాన కృష్ణ దాసు జి.బాబూరావు కె.శ్రీనివాసులు శ్రీకాంత రెడ్డి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి (కాంగ్రెస్) శోభా నాగిరెడ్డి (పీఆర్పీ).
No comments:
Post a Comment