తెలంగాణ ప్రాంతానికి పరిమితమై వాదాన్ని, నినాదాన్ని వినిపించడానికి మరో రెండు కొత్త చానళ్లు జనం ముందుకు రానున్నాయి. ఎంపీ వివేక్ టీం వి6 పేరుతో చానల్ తెస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఈ చానల్లో ఇప్పటికే ట్రైనీ ఉద్యోగులను నియమించుకొని శిక్షణ ఇస్తున్నారని సమాచారం. సీనియర్లను తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరిస్తున్నారని వినికిడి. జీతాల విషయంలో కూడా గతంలో కొన్ని చానళ్లలాగా బోల్తా పడకుండా.. కాస్తో కూస్తో ప్రతిభ ఉన్నవారికే పట్టం కట్టాలని యోచిస్తున్నట్టు ఆ చానల్‌తో సంబంధం ఉన్న నా సహచరుడు తెలిపాడు. అయితే అదే సాకుతో చానల్ ను ట్రైనీల చేతిలో పెట్టినా ఇబ్బందేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా తెలంగాణ ప్రాంత జర్నలిస్టులకు మరిన్ని అవకాశాలు దొరికినట్టే.. ఇప్పటికే తెలంగాణ కళారూపాలను బుల్లితెరపై ఆవిష్కరించడంలో ముందున్న టీన్యూస్‌ని మరికొందరు అనుసరించబోయి బోల్త పడ్డారు. హెచ్ఎంటీవీ మాత్రం రసమయితో చేసే మార్మోగినపాట మాత్రం కాస్త సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక టీన్యూస్ లో ప్రేమ్‌రాజ్, జనార్దన్‌లు మొదలు పెట్టిన మాటా ముచ్చట నిరాటంకంగా కొనసాగుతోంది. ఇదో ట్రెండ్ సెట్టర్‌గా మారడం ఆ చానల్ సాధించిన విజయమే.. తరువాత మా టీవీని అనుసరించి పెట్టిన రేలారే ధూంధాం.. ఆరభశూరత్వంగా మారింది. టీవీ9 మాపల్లెపాట బొక్కాబోర్లా పడింది. గానపదమని,.. ఇంకా రకరకాలపేర్లతో పెట్టిన చానళ్లన్నీ ప్రొడక్షన్ క్వాలిటీ లేక, సరియైన ప్రొడ్యూసర్ లేక చతికిల పడ్డాయి. తాజాగా వి6 చానల్ కూడా ఇటువంటి కార్యక్రమం ఒకటి జజ్జనకరి జనారే.. పేరుతో రూపొందిస్తుందని అవిశ్వసనీయ సమాచారం. ఇక టిఎన్ఎన్ పేరుతో వచ్చే మరో తెలంగాణ నెట్‌వర్క్ చానల్.. రిక్రూట్ చేసుకుంటోంది. ఇందులో కళాకారులు, జర్నలిస్టు వృత్తిలో ఉన్నవారు ఇరువురూ పాలు పంచుకుంటున్నారు. అయితే ఈ చానల్ పై మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నా.. తెలంగాణ ప్రజల గొంతు వినిపించేందుకు మరోవేదకి దొరికినట్టయింది. కొత్తగా జర్నలిజంలోకి రావాలని ఉబలాట పడేవారికి ఇవి వేదికలుగా మారనున్నాయి. చానళ్లు ఎన్ని వచ్చినా 1వ తారీఖు వరకు జీతాలు చెల్లించేలా ఉంటే అదే పదివేలు..(స్టార్టింగ్ వేతనం ఐదువేలేలెండి)
Its misleading that a channel by Vivek is coming for Telangana.
ReplyDeleteListen, THe CEO of V6 is more loyal to TG Venkatesh and his old boss.
He was not a supporter of Telangana in all his life and he is never a journalist in his career. All the time he used to just manage the other side of media i.e., black/white/yeloow mailing.
So in V6 we are going to lose the money of Vivek/Visaka Industries and the careers of some seriuos Telangana journalists.
This CEO is already made his network of his collection agents.
He may not sell the staffer/guns like in I News, but he is now executing a new strategy.
Better luck MP Vivek. after all its the money of public, who invested in Visaka Ind Ltd going to lose.. poor investors, poor viewers!!
TNN, less we talk its better. In the name of TElangana channel, some people have been collecting funds for the last two years. but nothing moved ahead.Emotional investors like Kuldeep Sahani and S Reddy are the losers. The Editor/CEO make money without even starting the venture. Sounds like an Andhra Conmpany fraud..
TEll me anna, where did you learn these Andra tricks!?